Sehwag: పంత్, గిల్ కెప్టెన్సీలపై సెహ్వాగ్ అసహనం 20 d ago

ఐపీఎల్ 18 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్, లఖ్ నవూ సూపర్ జెయింట్స్ పరాజయాలతో తమ యాత్రను ప్రారంభించాయి. తొలి మ్యాచులో ఈ రెండు జట్లు ఓడిపోయాయి. పంజాబ్ చేతిలో 11 పరుగుల తేడాతో గుజరాత్, ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఎల్ఎస్‌జీ ఓటమిని చవిచూశాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ రిషబ్ పంత్, శుభమన్ గిల్ కెప్టెన్సీపై విమర్శలు గుప్పించారు. సరైన నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమవుతున్నారని పేర్కొన్నారు. ఉప్పల్ వేదికగా ఇవాళ సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో లఖ్ నవూ మ్యాచ్ ఆడనుంది. ఎస్ఆర్ హెచ్‌ను కట్టడి చేయడంలో పంత్ దూకుడైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు.